Rammohan Naidu : అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. ఇండియన్ ఫ్లైట్ యాక్సిడెంట్ లోనే అత్యంత ప్రమాదకరమైనదిగా దీన్ని చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకునే బ్లాక్ బాక్స్ విచారణ మీదనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ బ్లాక్ బాక్స్ ను విదేశాలకు తరలించి అక్కడ విచారణ జరిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. Read Also : Kannappa : కన్నప్పకు…
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఘోర విమాన దుర్ఘటనను పౌర విమానయాన శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలిలో సహాయచర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గుజరాత్ ప్రభుత్వం, పౌరవిమానయాన శాఖ సంయుక్తంగా స్పందించినట్లు స్పష్టం చేశారు.