ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు… మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఆగ్రహ సభలో ప్రసంగించిన ఆయన.. కమ్యూనిస్టులు నీచులని, యూనియన్లతో వ్యవస్థల్ని నాశనం చేశారని మండిపడ్డారు. ఇక, కమ్యూనిస్టులు మొరిగే కుక్కలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అయితే, అదే స్థాయిలో కమ్యూనిస్టులు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.. సోము వీర్రాజును పిచ్చి కుక్క కరిచిందని వ్యాఖ్యానించారు పి. మధు.. బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు.. అసలు…
వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో ఇంటికి ఒకటే మీటర్ ఉండాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు నోటీసులివ్వడం దుర్మార్గమని ఆయన అన్నారు. దశాబ్దాల కాలం నుంచి ఒక ఇంటిలోని పోర్షన్ల ఆధారంగా విద్యుత్ సంస్థలు మీటర్లు ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు ఒకే ఇంట్లో ఎన్ని పోర్షన్లు ఉన్నప్పటికీ ఓకే మీటర్ ఉంచి, మిగతావి రద్దు చేసుకోవాలని ఎలక్ట్రిసిటీ అధికారులు నోటీసులు ఇస్తున్నారని ఆయన అన్నారు. ఫలితంగా మీటర్…
ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కు కాపు కాస్తారు. ఉద్యమాల్లో కాంగ్రెస్‌తో దోస్తీ. తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీల తీరు ఇది. రైట్ టర్న్ తీసుకుంటున్న సమయంలో లెఫ్ట్ ఆలోచనలు ఎందుకు మారుతున్నాయి? కామ్రేడ్ల నిర్ణయాల వెనక బలమైన కారణాలు ఏంటి? ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల వైఖరిపై ఆసక్తికర చర్చ..! తెలంగాణలో ఎన్నికలేవైనా.. కమ్యూనిస్ట్ పార్టీలపై కూడా చర్చ జరుగుతుంది. సీపీఐ, సీపీఎంలు ఏం చేస్తాయి? పోటీ చేస్తాయా.. లేదా? ఎవరికి మద్దతుగా నిలుస్తాయి అనేది ఆ చర్చ సారాంశంగా ఉంటుంది.…
ఏపీలో 3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహాపాదయాత్రను ప్రారంభించారు. గత నెల 1న ప్రారంభమైన ఈ పాదయాత్రం ఈ నెల 15న ముగియనుంది. 45 రోజుల పాటు సాగనున్న రైతుల పాదయాత్ర తిరుమలలో ముగిసే విధంగా ప్రణాళికను సిద్దం చేశారు. అయితే రాజధాని రైతుల పాదయాత్రకు ఊరురా ప్రజలు, రైతులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే తాజాగా రైతుల పాదయాత్ర…
ఏపీలో వచ్చిన వరద నష్టాన్ని పరిశీలించేందుకు ఒక్క కేంద్ర మంత్రి రాలేదని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం, సీఎం జగన్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. రాయలసీమలో వచ్చిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న జగన్ పర్యటనను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్క ప్రజాప్రతినిధి ప్రజలకు అండగానిలవలేదని ఆయన మండిపడ్డారు.…
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ కుడి కాలికి గాయమైంది. మంగళవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా రాయల చెరువు లీకేజీ, ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు కు చేరుకున్నారు. అక్కడి నుండి కొండపై కిలోమీటరు మేర నడుచుకుంటూ రాయల చెరువు కట్ట వద్ద కు చేరుకున్నారు. అయితే… కొండ నుండి దిగే సమయంలో నారాయణ కుడి కాలు బెణికింది. కాలుకు వాపు రావడంతో పైకి లేవలేక అక్కడే కూర్చున్నారు. అదే సమయంలో చెరువు…
తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన హన్మకొండలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం కేంద్రాల వద్ద రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. రాష్ర్టంలో 7000కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చాల్సి ఉన్నా ప్రస్తుతం 4000 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాత్ర మే ప్రభుత్వం…
ప్రధాని నరేంద్రమోడీ 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో దూకుడుగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే విధంగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు. ఈ మూడు నల్ల చట్టాల ను రద్దు చేయాలని కోరుతూ.. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోనే కొన్ని నెలలుగా రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెల్సిందే.. అయితే ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఆ వ్యవసాయ చట్టాలను ఉపసం హరించుకుంటున్నట్టు ప్రకటించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ.. మోదీ ప్రకటించడంతో… ఈ దేశ రైతుల…
టీఆర్ఎస్ ధర్నాలు చేయాల్సింది రాష్ర్టంలో కాదని ఢీల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన బీజే పీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో మాత్రం ధర్నాలు చేయడం సిగ్గు చేటన్నారు. ముందు వడ్లు కొనుగోలు చేయడానికి రాష్ట్ర బీజేపీ నాయ కులు కేంద్రం పై ఒత్తిడి పెంచాలని ఆయన కోరారు. రాష్ట్రంలో బీజే పీ,…
రాష్ర్టంలో పెట్రోల్, డీజీల్ రేట్లు పెరిగినా ప్రభుత్వం ఇప్పటికీ తగ్గించకుండా చోద్యం చూస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజ ల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శంచారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలపై అధికంగా భారం మోపుతూ అదానీలకు దోచిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే పోర్టులు,సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను అదానీకే సీఎం జగన్ అప్పగించారన్నారు.రాష్ట్రం మొత్తాన్ని వారికి దోచిపెట్టడానికే సీఎం జగన్ అధికారంలో ఉన్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి అధికార పార్టీ…