తెలంగాణలో ఇంకా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కాలేదని… తెలంగాణ వైద్య శాఖ ప్రకటన చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 13 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపింది. ఈ రోజు సాయంత్రం వరకు జీనోమ్ సిక్వెన్స్ ఫలితాలు వచ్చే అవకాశమని.. తెలంగాణ వైద్య శాఖ పేర్కొంది. ఈ మహమ్మరిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం అవసరమని.. హైదరాబాద్ లో రేపో మాపో కొత్త వేరియంట్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది వైద్యశాఖ.…
కరోనా మహమ్మారి రూపం మార్చుకుంటూ యావత్ ప్రపంచ మానవాళి గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. ధనిక, పేద దేశాలు అని తేడా లేకుండా అందరిమీద దాడి చేస్తూనే ఉంది.. జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటూ ప్రజలను భయపెడుతోంది. ఇప్పుడు డెల్టా వేరియెంట్‌లోని ఏవై.4.2 రకం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తాజాగా కొత్త వేరియంట్ లక్షణాలు కనిపించినట్టు డాక్టర్లు ప్రకటించారు. యూకేలో కొత్త వేరియంట్ కేసులు ఆగడం లేదు. ఇటు, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లో కూడా వెలుగు…
విద్యా సంస్థల ప్రత్యక్ష తరగతులపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కొన్ని రాష్ట్రాలు ప్రత్యక్ష తరగతులకు సమాయత్తం అవుతున్నాయి. ఒకటి రెండు రాష్ట్రాల్లో పాక్షికంగా ప్రారంభమయ్యాయి కూడా. ఈ పరిస్ధితుల్లో… తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.గత రెండేళ్లుగా విద్యార్థులు తరగతి గది బోధనకు దూరం అయ్యారు. పాఠశాల విద్యార్థులయితే పరీక్షలు కూడా లేకుండానే పై తరగతులకు వెళ్లారు. డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నా.. ఎంత వరకు బుర్రకు ఎక్కుతున్నాయో…
ప్రపంచాన్ని వణికిస్తోన్న మాయదారి కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అయితే, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలను వ్యాక్సిన్ల కొరత వెంటాడుతూనే ఉంది.. కానీ, త్వరలోనే వ్యాక్సిన్ల కొరత తీరపోనుంది.. ఎందుకంటే.. వచ్చే ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య ఐదు నెలల వ్యవధిలో మరో 135 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి రానున్నాయి. వ్యాక్సినేషన్‌పై సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పేర్కొంది. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కొవిషీల్డ్ డోసులు…