ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని కోవిడ్ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ డా. ఎన్‌కే అరోరా స్పష్టం చేశారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో నమోదవుతున్న కేసుల్లో 75 శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌వే అని ఆయన తెలిపారు. గత ఏడాది డిసెంబర్ తొలి వారంలో మొదటి ఒమిక్రాన్ కేసును గుర్తించగా రెండు వారాల్లోనే ఈ వేరియంట్ దేశమంతటా వ్యాపించిందని పేర్కొన్నారు. డిసెంబర్ తొలివారం నుంచి చివరి వారం వరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 12 శాతం…