తెలంగాణలో వాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. జూన్‌లో పెద్దెత్తున వాక్సినేషన్ జరిగినా, ఒక్కసారిగా ఢీలా పడింది. మొదటి డోస్ వేసుకున్నోళ్లకు రెండో డోస్ ఇప్పుడు దొరకడం లేదు. ఇక ఫస్ట్ డోస్ వేసుకుందామనుకున్నవారికి అదికూడా దక్కడం లేదు. ఏ సెంటర్లో ఏ వ్యాక్సిన్ వేస్తున్నారో జనం వెతుక్కోవాల్సి వస్తోంది. తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన వారందికీ వాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు హైరిస్క్‌లో ఉన్న వాళ్ళకు మాత్రమే వాక్సిన్ వేయగా అర్హులందరికీ టీకా ఇస్తున్నారు.. ప్రభుత్వ సెంటర్లతో పాటు…