ఆసియాలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు మళ్లీ పెరుగుతున్నాయి. సింగపూర్, హాంకాంగ్ వంటి జనసాంద్రత కలిగిన ఆర్థిక కేంద్రాలలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం, బూస్టర్ డోస్‌లు తీసుకునే వృద్ధుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఈ పెరుగుదల సంభవిస్తుందని ఆరోగ్య అధికారులు భావిస్తున్నారు. సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. మే 3 నాటికి COVID-19 కేసుల సంఖ్య 14,200 కు చేరుకుంది. ఇది గత వారం కంటే దాదాపు 28% ఎక్కువ.