కరోనా మహమ్మారి బారినపడి మృతిచెందినవారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. కోవిడ్ సోకి మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపింది.. రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధుల నుంచి ఈ పరిహారం అందజేయనుండగా.. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది తెలంగాణ సర్కార్.. ఇక, కోవిడ్ డెత్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది ప్రభుత్వం.. మృతుల కుటుంబ సభ్యుల ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది..…