తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,367 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 193 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరో వ్యక్తి కోవిడ్ బారినపడి మృతిచెందాడు.. ఇదే సమయంలో.. 196 కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,69,932 కి చేరగా.. రికవరీ కేసులు…
కరోనా ఎంట్రీతో ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవనం అస్తవ్యస్తంగా మారింది. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులో లేని సమయంలో చాలాదేశాలు ఈ మహమ్మరి బారినపడి కుదేలయ్యాయి. ముఖ్యంగా అగ్ర రాజ్యాలైన అమెరికా, ఇటలీ, బ్రిటన్, చైనా, తదితర దేశాలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యాయి. ఈ దేశాల్లో కరోనా సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కరోనా తొలివేవ్ గా గుర్తించిన ఈ సమయంలో లక్షలాది మంది అమాయక ప్రజలు కరోనాతో మృత్యువాతపడగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. …
ఏపీలో కరోనా క్రమంగా పెరుగుతున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 43,494 శాంపిల్స్ పరీక్షించగా.. 478 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఆరుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 574 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా నేటి వరకు కరోనా టెస్ట్‌ల సంఖ్య 2,91,85,656 కు పెరిగింది.. ఇక, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,62,781 కు పెరగగా.. రివకరీ…
కరోనా మహమ్మారికి పుట్టినిల్లు ఏది అంటే అంతా చైనా పేరును చెబుతారు.. మొదట్లో ఆ ఆదేశాన్ని కలవరానికి గురిచేసిన కోవిడ్ 19.. అన్ని దేశాల్లో ఆందోళనకర పరిస్థితికి చేరుకునేసరికి.. అక్కడ మాత్రం ఏమీ లేకుండా పోయింది. అయితే, అప్పుడప్పుడు.. కొత్త వేరియంట్లు వెలుగు చూస్తూ డ్రాగన్ కంట్రీని షేక్ చేస్తూన్నాయి. ఇప్పటికే పలు దాపాలుగా చైనాను మహమ్మారి పలకరించిపోయింది.. తాజాగా.. మరోసారి కలవరం సృష్టిస్తోంది.. దీంతో, కట్టడి చర్యలకు దిగింది కమ్యూనిస్టు సర్కార్.. వందలాది విమాన సర్వీసులను…
భారత్‌లో టీకా కార్యక్రమం వేగంగా సాగుతున్నది. ఇప్పటికే 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ జరిగింది. త్వరలోనే దేశంలో అర్హులైన అందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది భారత ప్రభుత్వం. అయితే, చిన్నారులకు సంబంధించి వ్యాక్సినేషన్ కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నది. కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను తయారు చేసిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా వ్యాక్సినేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో మరింత వేగంగా డోసుల కార్యక్రమం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం…
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 16 వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. మొదట నిదానంగా సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆ తరువాత దశల వారీగా పెంచుకుంటూ వెళ్లారు. కాగా నేటితో దేశంలో వందకోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ప్రపంచంలోనే అత్యధిక డోసులు వేసిన దేశంగా భారత్ నిలిచింది. దేశంలోని 9 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో అర్హులైన అందరికీ మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తయినట్టు…
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ తాను భారతీయురాలిగా గర్వపడుతున్నాను అని తెలిపారు. 100 కోట్లా టీకా డోస్ లు పంపిణీ మార్క్ ని చేరడం సంతోషంగా ఉంది. ఈ విజయం వైద్యులు, మెడికల్ ప్రొఫెషనల్స్ ది, ఈ సందర్భంగా ప్రధాని మోదికి కృతజ్ఞతలు. ఈ విజయంతో అనేక దేశాలు మన వైపు చూస్తున్నాయి. భారత్ లాంటి జనభా ఎక్కువగా వున్న దేశాలు ఇలాంటి విజయం సాధించడం నిజంగా అంత సులభం కాదు. స్వదేశంలో తయారైన వ్యాక్సిన్…
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ దూసుకుపోతున్న వేళ.. డబ్ల్యూహెచ్‌వో ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. దీంతో భారత్‌ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ అభినందించారు. 100 కోట్ల డోసులను పంపిణీ చేసి భారత్ చరిత్ర లిఖించిందంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌ను టెడ్రోస్ అథనోమ్ రీట్వీట్ చేశారు. కరోనా వైరస్ ముప్పు పొంచి ఉన్న వేళ ప్రజలను…
పాకిస్తాన్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా ఆ దేశంలో కొత్త వేరియంట్ బయటపడింది. ఈ వేరియంట్ కేసులు అధిక సంఖ్యలో నమోదువుతున్నాయి. ఎప్సిలాన్ వేరియంట్‌గా పిలిచే ఈ కోవిడ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. మొదట ఈ వేరియంట్‌ను క్యాలిఫోర్నియాలో గుర్తించారు. దీనిని క్యాలిఫోర్నియా స్ట్రెయిన్ లేదా బి 1.429 గా పిలుస్తారు. ఈ వేరియంట్ యూఎస్, యూకేలో వ్యాప్తి చెందింది. యూకేలో అత్యధిక కేసుతు ఈ వేరియంట్ ద్వారా ప్రస్తుతం నమోదవుతున్నాయి. ఈ ఎప్సిలాన్…
కోవిడ్ వ్యాక్సినేషన్‌లో ఇండియా మరో మైలురాయిని అధిగమించనుంది. ఇవాళ వందకోట్ల వ్యాక్సిన్‌లను పూర్తి చేసింది.. వంద కోట్ల టీకా మైలురాయి దాటగానే ఆనందం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని.. భారత్ చరిత్ర సృష్టించింది.. 130 కోట్ల మంది భారతీయులు.. భారతీయ సైన్స్, ఎంటర్‌ప్రైజ్ మరియు సమిష్టి స్ఫూర్తి సాధించిన విజయాన్ని మనం చూస్తున్నాం.. 100 కోట్ల టీకాలు దాటినందుకు భారతదేశానికి అభినందనలు.. మా వైద్యులు, నర్సులు మరియు ఈ…