తెలంగాణలో కరోనా రోజువారి కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 26, 676 శాంపిల్స్ పరీక్షించగా… 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో కరోనా బాధితుడు మృతి చెందారు. ఇదే సమయంలో 176 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,68, 955 కు చేరుకోగా… రికవరీ కేసులు…
చైనాలోని వ్యూహాన్ నగరంలో కరోనా మహమ్మరి తొలిసారి వెలుగుచూసింది. గడిచిన ఏడాదిన్నరగా ఈ మహమ్మరి ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. కరోనా ధాటికి లక్షలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. కోట్లాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడాల్సి వచ్చింది. కరోనా మొదటి దశలో అగ్రదేశాలైన అమెరికా, చైనా, బిట్రన్, ఇటలీ, ఫ్రాన్స్ ఎక్కువ నష్టపోవాల్సి వచ్చింది. కరోనా తొలి వేవ్ ను సమర్ధవంతంగా భారత్ సెకండ్ వేవ్ లో మాత్రం మూల్యం…
కరోనా కారణంగా చాలా కాలంపాటు ఆంక్షలు కొనసాగడంతో కాలుష్యం చాలా వరకు తగ్గిపోయింది. కాగా, ఆంక్షలను చాలా వరకు ఎత్తివేశారు. రోడ్డుమీదకు వాహనాలు తిరిగి పరుగులు తీస్తున్నాయి. దీంతో వాయుకాలుష్యం తిరిగి మొదలైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 350 పాయింట్లు దాటడంతో పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, యూపీ సరిహద్దుల్లో పంట వ్యర్థాల దహనంతో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోతున్నది. పంట వ్యర్థాలను…
భారత్‌లో మరోసారి కరోనా పాజిటివ్ రోజువారి కేసులు పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 14,146 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 144 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 19,788 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,40,67,719 కు పెరగగా.. రికవరీ కేసులు 3,34,19,749కు…
తెలంగాణలో కరోనా రోజువారి కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 30,050 శాంపిల్స్ పరీక్షించగా… 111 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 187 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,68,833 కు చేరుకోగా… రికవరీ కేసులు 6,60,917 కు పెరిగాయి..…
కరోనా కొత్త కేసులపై దసరా పండుగ ప్రభావం స్పష్టంగా కనిపించింది.. దేశవ్యాప్తంగా ఇవాళ కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.. దీనికి ప్రధాన కారణం టెస్ట్‌ల సంఖ్య తగ్గడమే.. ఇక, ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ఏపీలోనూ టెస్ట్‌ల సంఖ్య భారీగా తగ్గిపోయింది.. కొత్త కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి.. బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29,243 శాంపిల్స్ పరీక్షించగా.. 332 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఏడుగురు కోవిడ్…
భారత్‌లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది… ఇక, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్నాయి.. అయితే, శుక్రవారం దసరా పండగ కావడంతో.. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా తగ్గిపోయింది.. అది కూడా కేసుల సంఖ్య తగ్గడానికి కారణంగా చెప్పవచ్చు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 9,23,003 శాంపిల్స్ పరీక్షించగా.. 15,981 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో 116 మంది…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు తగ్గింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 44,946 శాంపిల్స్ పరీక్షించగా.. 586 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 9 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 712 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,89,24,891 కు…
దసరా పండుగను అంతా ఘనంగా సెలబ్రేట్ చేస్తే.. ఏపీలోని ఓ ప్రాంతంలో మాత్రం కర్రల సమరం జరుగుతోంది.. కర్నూలు జిల్లాలోని హుళగుంద మండలంలోని దేవరగట్టు మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్ర ఉత్సవం నిర్వహిస్తున్నారు.. అర్ధరాత్రి సమయంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.. ఉత్సవంలోని మూర్తులను దక్కించుకోవడానికి ఊర్లకు ఊర్లే తలపడతాయి.. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాలను చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. ఈ ఉత్సవంలో పాల్గొంటారు.. మరోవైపు అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద,…
ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 16,862 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,40,37,592కి చేరింది. ఇందులో 3,33,82,100 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2,03,678 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 379 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైనమొత్తం కరోనా మరణాల సంఖ్య 4,51,814కి చేరింది. ఇక ఉదిలా ఉంటే, గడిచిన…