తెలంగాణలో కరోనా కొత్త కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది.. గత బులెటిన్‌తో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో తెలంగాణలో 2,421 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతిచెందగా.. ఇదే సమయంలో 3,980 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 7,71,828కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య…
తెలంగాణలో కొత్తగా 2,646 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 88,206 శాంపిల్స్ పరీక్షించగా 2,646 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 3,603 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. దీంతో.. తెలంగాణ ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,69,407కు చేరుకోగా..…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజువారి కేసులు మళ్లీ పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,040 శాంపిల్స్ పరీక్షించగా.. 5,983 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 11 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. విశాఖపట్నంలో నలుగురు, కడపలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున కన్నుమూశారు.. ఇక, ఇదే సమయంలో 11,280 మంది కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం..…
ఇప్పుడప్పుడే ఈ కరోనా మహమ్మారి పోయేలా కనిపించడం లేదు. చిత్ర పరిశ్రమను ఒక్కసారిగా కుదేలు చేసిన ఈ మహమ్మారి మరోసారి ప్రజలపై విరుచుకుపడుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా స్టార్స్ కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తుంది. ఈ మధ్యనే కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రాధికా శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్ కు పాజిటివ్ రావడంతో వారు ఐసోలేషన్ లో ఉండి ఇటీవలే బయటికి…
ఐదేళ్ల లోపు చిన్నారులకు కరోనా టీకా ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. ఆరు నెలల నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఔషధ సంస్థ ఫైజర్.. ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేసుకుంది. దీనికి అనుమతి లభిస్తే చిన్నారులకు అందుబాటులోకి వచ్చిన తొలి టీకాగా ఫైజర్ నిలవనుంది. అమెరికాలో కరోనా కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరిగిందని ఫైజర్ తెలిపింది. Read Also: కలవరపెడుతోన్న బీఏ.2 వేరియంట్.. డబ్ల్యూహెచ్‌వో ఆసక్తికర వ్యాఖ్యలు…
కరోనా మహమ్మారి విజృంభణ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది.. ఇక, సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరింత టెన్షన్ పెడుతోన్న సమయంలో.. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.. ప్రస్తుతం బీఏ.2 వేరియంట్ పలు దేశాలకు కునుకులేకుండా చేస్తోంది.. అయితే, బీఏ.2 వేరియంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).. ఆ వేరియంట్‌పై నిర్వహించిన స్టడీ ప్రకారం.. ఇప్పటికే దాదాపు 60 దేశాలకు పాకేసింది.. ఒమిక్రాన్ వేరియంట్ కన్నాఇది రెట్టింపు స్పీడ్‌తో వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌వో…
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.. ఏపీ, తెలంగాణలో తగ్గుముఖం పడుతున్నాయి పాజిటివ్ కేసులు.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 25,284 శాంపిల్స్ పరీక్షించగా.. 5,879 మందికి పాజిటివ్ గా తేలింది.. మరో 9 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. కర్నూలు, నెల్లూరులో ఇద్దరు చొప్పున, చిత్తూరు, కడప, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.. ఇదే సమయంలో.. 11,384 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా 3,24,70,712…
ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ 19 డ్యాష్ బోర్డులో ప్రస్తావించిన అంశం ఒకటి వివాదానికి ఆజ్యం పోస్తోంది. జమ్మూకాశ్మీర్ ని డబ్ల్యుహెచ్ వో డ్యాష్ బోర్డులో చైనా పాకిస్తాన్ లోని భాగంగా ప్రపంచ మ్యాప్ లో చూపించడం ఈ వివాదానికి కారణం అయింది. భారత్ లో అంతర్భాగమయిన కాశ్మీర్ ని ప్రపంచ ఆరోగ్యసంస్థ అలా చూపించడంపై టీఎంసీ ఎంపీ డా.శంతాను సేన్ తీవ్రంగా స్పందించారు. దీనిపై ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. ఈ మ్యాప్ లో…
కరోనా తీవ్రరూపం దాలుస్తున్న టైంలో కరోనా సోకిన వారు, కరోనా నుంచి రక్షణ పొందినవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది చాలామందిని వేధిస్తుంటుంది. కరోనా నివారణకు కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా అవి కొంతమేరకే రక్షణ కల్పిస్తున్నాయని చెప్పాలి. రెండు డోస్ లు వ్యాక్సిన్ వేయించుకున్నా. మళ్లీ బూస్టర్ డోసు వేసుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రాణాంతక విషపు వైరస్ నుంచి బయటపడాలంటే..మన ఒంట్లోని వ్యాధినిరోధక యంత్రాంగం బలంగా తయారు కావాలి. ఇమ్యూనిటీ బలంగా ఉంటే…
ఫీవర్ సర్వేతో రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా తగ్గినట్టు వెల్లడించారు.. మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడాన్ని అభినందించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అన్నారు.. కరోనా సెకండ్ వేవ్ లో 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం పడింది. కానీ, 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే…