ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత కిందకు దిగింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 61,678 శాంపిల్స్ పరీక్షించగా.. 1,217 మందికి పాజిటివ్ గా తేలింది.. మరో 13 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 1,535 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 2,60,34,217కు పెరగగా… మొత్తం…
ఇండియాలో కరోనా కేసులతో పాటుగా మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో కొత్తగా 34,457 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,23,93,286 కి చేరింది. ఇందులో 3,15,97,982 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,61,340 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 375 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,33,964 కి చేరింది.…
తెలంగాణలో కరోనా పాజిటివ్ రోజువారి కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 73,899 సాంపిల్స్ పరీక్షించగా.. 359 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృత్యువాతపడ్డారు.. ఇదే సమయంలో 494 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,394 కు చేరగా.. రికవరీ కేసులు 6,43,812…
ప్రపంచంలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. అమెరికాలో ప్రతిరోజూ లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో సింహభాగం కేసులు డెల్టావేరియంట్ కేసులు ఉండటంతో ఆ దేశం అప్రమత్తం అయింది. వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరిగిపోతుండటంతో నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్క్‌ను తప్పనిసరి చేశారు. మరోవైపు విజయవంతంగా ఒలింపిక్స్‌ను నిర్వహించిన జపాన్‌లో కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజూ 20 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో 12 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ…
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1,435 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,00,038 కి చేరింది. ఇందులో 19,70,864 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 15,472 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 6 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో…
కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… వచ్చే నెల నాలుగో తేదీ (సెప్టెంబర్ 4వ) వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగిస్తున్నట్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.. ఏపీ సర్కార్ ఉత్తర్వుల ప్రకారం.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది… ఆ తర్వాత యథావిథగా అన్ని కార్యక్రమాలకు అనుమతి ఉంటుంది.. అవి కూడా కరోనా నిబంధనలకు లోబడి చేసుకోవాల్సి…
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగేందుకు చర్యలు తీసుకుంటుంది భారత ప్రభుత్వం.. దేశీయ వ్యాక్సిన్లతో పాటు విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇస్తూ వస్తోంది.. ఇప్పటి వరకు 18 ఏళ్ల పైబడినవారికి మాత్రమే వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా.. 18 ఏళ్లకు దిగువ వయస్సున్నవారిపై మాత్రం కొన్ని ట్రయల్స్ జరుగుతున్నాయి.. ఈ దశలో భారత్ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్ ముందుంజలో ఉంది.. మరోవైపు.. పెద్దలకు సింగిల్ డోస్‌తో వ్యాక్సిన్ రూపొందించి పంపిణీ చేస్తోంది అమెరికా…
భారత్‌లో మరోసారి స్వల్పంగా పెరిగాయి కరోనా పాజిటివ్ రోజువారి కేసులు… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 36,571 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 530 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 39,157 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,23,22,258కు పెరగగా.. రికవరీ కేసులు 3,15,25,080కు…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. రోజుకో కొత్త వేరియంట్ తరహాలో.. ప్రజలను భయపెడుతూనే ఉంది… తాజాగా, డెల్టా వేరియంట్‌తో ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది.. ముఖ్యంగా ఆసీస్‌లోని సిడ్నీ డెల్టా వేరియంట్ దెబ్బకు వణికిపోతోంది.. దీంతో మహమ్మారి కట్టడికోసం కఠినమైన నిబంధనలకు పూనుకుంటుంది ప్రభుత్వం.. ఇప్పటికే అమల్లో ఉన్న లాక్‌డౌన్ నిబంధనలను మరోమారు పొడిగించింది. సెప్టెంబర్ చివరి వరకు సిడ్నీలో లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది ప్రభుత్వం… ఇక కొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ కూడా అమల్లో ఉంటుందని వెల్లడించారు.…
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో.. భారీగా పతనమైన క్రూడాయిల్ ధరలు.. ఆ తర్వాత మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. కానీ, ఇప్పుడు మళ్లీ కిందికి దిగివస్తున్నాయి.. బ్రెంట్ రకం క్రూడాయిల్ ధర పీపాకు 3 శాతానికి పైగా తగ్గి ఈ ఏడాది మే నెల కనిష్ఠ స్థాయి 66 డాలర్లకు జారుకుంది క్రూడాయిల్ ధర… దీనికి కారణం.. అమెరికాతోపాటు పలు దేశాల్లో కరోనా…