ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీకి హైకోర్టు నుంచి ఊరట లభించింది. సబ్ జైలు నుండి అడియాలా జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. రెండు కేసుల్లో దోషిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను రావల్పిండిలోని హై సెక్యూరిటీ అడియాలా జైలులో ఉన్నారు. కాగా.. బుష్రా బీబీని ఇస్లామాబాద్ శివారులోని ఇమ్రాన్ ఖాన్ నివాసం బనిగాలాలో ఖైదుగా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడి నుంచి అడియాలా జైలుకు తరలించారు.