Godavari Flood: అల్పపీడన ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి లక్ష 51 వేల క్యూసెక్కులు మిగులు జలాలు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 8.90 అడుగులుగా నమోదు అయ్యింది. బ్యారేజ్ నుండి వ్యవసాయ అవసరాలకు తూర్పుడెల్టాకు 3800 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2100 క్యూసెక్కులు, పశ్చిమడెల్టాకు 4700 క్యూసెక్కులు చొప్పున సాగునీరు విడుదల చేస్తున్నారు అధికారులు. గోదావరి ప్రాజెక్టులో…
గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసే కాటన్ బ్యారేజీ ప్రమాదంలో పడింది. మరమ్మతులు లేక.. రాను రాను బ్యారేజీ సామర్థ్యం తగ్గిపోతుంది. ఆధునీకరణకు నోచుకోక, మరమ్మతులకు గురై డేంజర్ పరిస్థితిలో పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం బ్యారేజీ మనుగడ పెంచుతుందా ? కాసులిచ్చి కాపాడుతుందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఉన్న కాటన్ బ్యారేజీ సామర్థ్యం, రోజు రోజుకు తగ్గిపోతుంది. కాటన్ బ్యారేజీ పునర్నిర్మాణం జరిగి అయిదు దశాబ్దాలు దాటుతున్నా..…
కాటన్ బ్యారేజీపై జనసేన శ్రమ దానానికి పర్మిషన్ రాలేదు. పవన్ శ్రమదాన కార్యక్రమంపై తేల్చి చెప్పేసారు ఇరిగేషన్ ఎస్ఈ. కాటన్ బ్యారేజీ రోడ్ ఆర్ అండ్ బి పరిధిలోకి రాదని స్పష్టం చేసారు. మానవతా దృక్పథంతో ప్రజల రాకపోకలకు అనుమతి ఇస్తున్నామని ప్రకటించారు. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం కలుగుతుందన్నారు అధికారులు. ఇదిలా ఉంటె బ్యారేజీపై రోడ్డు బాగు చేసే కార్యక్రమాన్ని జరిపి తీరుతాం అంటునారు జనసేన శ్రేణులు. తూర్పు గోదావరి,…