గూగుల్ కంపెనీలో ఉద్యోగమంటే ఎవరైనా ఎగిరి గంతెస్తారు.. అక్కడిచ్చే జీతం కంటే ఇతర సౌకర్యాల కోసం ఉద్యోగులు ఎగబడతారు. ఒక్కసారి ఆఫీసులోకి అడుగుపెడితే అన్నీ ఫ్రీయే. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తో పాటు స్నాక్స్, లాండ్రీ సర్వీస్, మసాజ్ పార్లర్ లే కాదు.. తరుచుగా కంపెనీ లంచ్ లు కూడా ఉంటాయి.. అలాంటిది ఇప్పుడు ఆ సౌకర్యాలకి గూగుల్ కంపెనీ కోత విధిస్తున్నాట్లు పేర్కొంది.
Zomato: జొమాటో అనగానే ఫుడ్ డెలివరీ గుర్తుకొస్తుంది. నిమిషాల వ్యవధిలో ఇంటికి తెచ్చిస్తారు. ఇంటికే కాదు. ఆఫీసులో ఉన్నా.. మరెక్కడ ఉన్నా.. లోకేషన్ ప్రకారం వాలిపోతారు. పార్సిల్ మన చేతిలో పెట్టిపోతారు. అయితే ఆ సంస్థ ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. దాదాపు 3 శాతం మంది సిబ్బందిని పనిలోంచి తీసేయాలనుకుంటోంది. తద్వారా లాభాలు ఆర్జించాలని కూడా ఆశిస్తోంది.