2024-25 ఆర్థిక సంవత్సరానికి పాస్‌పోర్ట్ దరఖాస్తుల ధృవీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించినందుకు గుర్తింపుగా, విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలంగాణ పోలీసులకు "సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్"ను ప్రదానం చేసింది. జూలై 24, 2024న న్యూఢిల్లీలో జరిగిన పాస్‌పోర్ట్ సేవా దివస్ కార్యక్రమంలో ఈ ప్రశంసా పత్రాన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బి. శివధర్ రెడ్డి ఐసీఎస్ స్వీకరించారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా హాజరై గుర్తింపు పత్రాన్ని అందించారు.
Daggubati Purandeswari : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు అంకితభావంతో పని చేస్తున్నారని తెలిపారు. 2024 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తక్కువ సమయంలోనే 11 కోట్ల మంది సభ్యత్వం పొందారని, ఆంధ్రప్రదేశ్‌లో 25 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చగలిగినందుకు పార్టీ కార్యకర్తల కృషిని కొనియాడారు. కార్యకర్తల ప్రతిష్ఠాభిమానంతోనే ఇది సాధ్యమైందని, భవిష్యత్తులో పారదర్శకంగా, సమర్థవంతంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని వివరించారు. బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి…