కరోనా కొత్త కేసులు భారీగా తగ్గడంతో ఇప్పటికే లాక్‌డౌన్‌కు ముగింపు పలికి అన్‌లాక్‌కు వెళ్లిపోయింది దేశ రాజధాని ఢిల్లీ.. తాజాగా పాజిటివ్ కేసులు మరింత తక్కువగా నమోదు అయ్యాయి… ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో కేవలం 316 కొత్త కేసులు వెలుగు చూశాయి.. మరో 41 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 521కు పెరిగింది.. యాక్టివ్ కేసులు…
కరోనా కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. భారతీయులు పవిత్రంగా భావించే గంగా నదిలో కరోనా బాధితుల మృతదేహాలు కొట్టుకురావడం.. వందలాది మృతదేహాలు గంగా నదిలో తేలడం తీవ్ర కలకలమే సృష్టించింది.. ఈ నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. గంగా నదిలో మృతదేహాలపై వస్తున్న కథనాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ఇది అవాంఛనీయమని పేర్కొన్న కేంద్రం.. కరోనా మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆరోగ్య శాఖతో సంప్రదించి తరచూ…