కరోనా మహమ్మారి రోజురోజు కొత్తగా రూపాంతరాలు చెందుతూ ప్రజలపై విరుచుకుపడుతోంది. గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు, దాని నివారణకై శాస్త్రవేత్తలు ఇప్పటికే తలలు బద్దలు కొట్టుకుంటుంటే ఇప్పుడు మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రానికి దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు ఆరోగ్య అధికారులు బుధవారం…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. గత రెండు కరోనా వేవ్‌లతోనే ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో మరోసారి కరోనా రక్కసి విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వివిధ దేశాలకు పాకిన ఈ వేరియంట్ భారత్‌లోకి కూడా ఎంటరైంది. ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు భారత్‌లో పెరుగుతున్నాయి. అంతేకాకుండా మునిపటికంటే ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య…
కోవిడ్ ధాటికి ప్రపంప దేశాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి కోలుకుంటున్న వేళ మరో వేరియంట్ వెలుగులోకి వచ్చి ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అయితే ఇప్పటికే తయారు చేసి పంపిణీ చేస్తోన్న కోవిడ్ కోవిడ్ టీకా ఈ వేరియంట్‌ను ఎదుర్కొగలదా అని ఆయా దేశాల శాస్త్రవేత్తలు తేల్చే పనిలో పడ్డారు. అయితే తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా కొత్త వేరియంట్ వ్యాప్తిపై అధ్యయనం చేస్తున్నామని వెల్లడించింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై…
కరోనా మహహ్మరి కొత్త రూపాంతరం చెందుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే కోవిడ్ కొత్త కొత్త వేరియంట్‌లతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ఇప్పుడు దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా ఇజ్రాయెల్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో 14 రోజుల పాటు విదేశీయులను దేశంలోకి రాకుండా, కొత్త కోవిడ్ వేరియంట్ ఓమిక్రాన్ అరికట్టడానికి చర్యలు తీసుకుంటోంది. అంతేకాకుండా విదేశాల నుంచి విమాన ప్రయాణాలను రద్దు ప్రకటించనుంది.…
కరోనా సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. కోవిడ్‌తో ఇప్పటికే యావత్తు ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. కోవిడ్ డేల్టా వేరియంట్‌తోనే పలు దేశాలు కుస్తీ పడుతున్న నేపథ్యంలో మరో కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. ఇది ఇప్పుడు వేగంగా దేశాలను చుట్టేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. Also Read : What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..? తాజాగా దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ (B111529) బ్రిటన్, ఇటలీ దేశాలకు వ్యాపించింది. ఈ నేపథ్యంలో…
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కూడా ఈ వేరియంట్ సోకుతోందని వార్తలు వస్తున్నాయి. కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలని ఈ సమావేశంలో ప్రధాని మోదీ సూచించారు. భారత్‌పై ఈ వేరియంట్ ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై అధికారులతో మోదీ చర్చించారు. Read…
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న దేశాలు కొత్త వేరియంట్ కారణంగా భయపడుతున్నాయి. దీని ప్రభావం క్రీడారంగంపైనా పడింది. ఈ నేపథ్యంలో మహిళల వన్డే ప్రపంచకప్ అర్హత టోర్నీని అర్థాంతరంగా రద్దు చేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. జింబాబ్వేలో జరుగుతున్న ఈ టోర్నీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఎందుకంటే దక్షిణాఫ్రికా దేశానికి పక్కనే జింబాబ్వే ఉంటుంది. అందువల్ల కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి భయంతోనే…
కరోనా మహమ్మరి యావత్తు ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. కోవిడ్ ప్రభావంతో ఎన్నో కుటుంబాలు అల్లకల్లోలమయ్యాయి. ఎంతో మంది అనాథలుగా మారారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి భారతవాని కోలుకుంటోంది. అయితే తాజాగా మరో వేరియంట్ B.1.1.529 ప్రబలుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై నేడు ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం నిర్వహించనున్నారు. కోవిడ్-19 పరిస్థితి, టీకాపై పీఎం నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనున్న సమావేశానికి కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా,…