కరోనా సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. కోవిడ్‌తో ఇప్పటికే యావత్తు ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. కోవిడ్ డేల్టా వేరియంట్‌తోనే పలు దేశాలు కుస్తీ పడుతున్న నేపథ్యంలో మరో కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. ఇది ఇప్పుడు వేగంగా దేశాలను చుట్టేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.
Also Read : What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజాగా దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ (B111529) బ్రిటన్, ఇటలీ దేశాలకు వ్యాపించింది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో రెండు, ఇటలీలో ఒక ఒమిక్రాన్ కేసు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కొత్త వేరియంట్ ప్రభావం తమ దేశాలపై పడకుండా ఆయా దేశాలు ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నాయి.