కోవిడ్ ధాటికి ప్రపంప దేశాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి కోలుకుంటున్న వేళ మరో వేరియంట్ వెలుగులోకి వచ్చి ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అయితే ఇప్పటికే తయారు చేసి పంపిణీ చేస్తోన్న కోవిడ్ కోవిడ్ టీకా ఈ వేరియంట్‌ను ఎదుర్కొగలదా అని ఆయా దేశాల శాస్త్రవేత్తలు తేల్చే పనిలో పడ్డారు. అయితే తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా కొత్త వేరియంట్ వ్యాప్తిపై అధ్యయనం చేస్తున్నామని వెల్లడించింది.
కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై భారత టీకాల సమర్థతను పరీక్షిస్తున్నామని తెలిపింది. అయితే ఇప్పటికే దీనిపై ప్రధాని మోడీ సైతం సమీక్ష నిర్వహించారు. ఒమిక్రాన్‌పై రాష్ట్రాలు ముందుస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒమిక్రాన్ రాకుండా ఉండేందుకు చర్యలు, ఒక వేళ రాష్ట్రంలోకి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు జరుపుతున్నారు.