ఇండియాలో కరోనా మహమ్మారి కారణంగా 40 లక్షల మంది మరణించారంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చేసిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. కరోనా వల్ల మృతిచెందిన వారి సంఖ్యను లెక్కించడానికి డబ్ల్యూహెచ్‌వో అనుసరించిన విధానాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. జనాభాలో, విస్తీర్ణంలో ఇంత పెద్ద దేశానికి ఒక గణిత నమూనాను ఫాలో కావడాన్ని తప్పుబట్టింది. తక్కువ జనాభా ఉన్న దేశాలకు అనుసరించిన విధానాన్నే భౌగోళికంగా, జనాభా పరంగా పెద్ద దేశమైన భారత్ విషయంలోనూ పాటించడం…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే వుంది. అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధిక మరణాలు సంభవించినవి భారత్ లోనే. దేశంలో ఇప్పటివరకూ 5 లక్షలమంది కోవిడ్ 19 కారణంగా మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత ఏడాది జులై 1కి మనదేశంలో మరణాలు నాలుగు లక్షలు నమోదయ్యాయి. 217 రోజుల్లో మరో లక్ష మరణాలు సంభవించాయి. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మరణాలు 5,00,055కి చేరాయి. గత 24 గంటల్లో 1,49,394 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.…
దేశంపై మరోసారి కరోనా మహమ్మారి తన పంజా విసురుతోంది. ఇప్పటికే దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని పలువురు నిపుణులు చెప్తున్నారు. తాజాగా అహ్మదాబాద్ ఐఐఎం వెల్లడించిన నివేదిక సంచలనం రేపుతోంది. ఈ నివేదిక ప్రకారం… దేశంలో ఇప్పటివరకు సంభవించిన కరోనా మరణాలపై కేంద్ర ప్రభుత్వం లెక్కలకు, వాస్తవ లెక్కలకు వ్యత్యాసం ఉందని తెలుస్తోంది. దేశంలో అధికారిక లెక్కల ప్రకారం కరోనా మరణాలు ఐదు లక్షలు ఉంటే… వాస్తవానికి దీని కంటే 6-7 రెట్లు అధికంగా ఉండొచ్చని…
స్వరరాగ గంగా ప్రవాహమే అని జేసుదాసు పాడితే పరవశించిపోయిన ఈ దేశంలో ఇప్పుడు శవగంగా ప్రవాహం చూశావా రాజా అని ప్రశ్నించే విషాదాన్ని సృష్టించిన వారెవరు? పరవశాన శిరసూగంగా తలకు జారెనా శివగంగ అని శంకరశాస్త్రి గానం చేసిన శివగంగను శవగంగగా మార్చిన వారెవరు? సెకండ్ వేవ్ అనే కరోనా మలిదెబ్బకు కుటుంబాలకు కుటుంబాలే బలైపోతుంటే ప్రాణవాయువును అందించలేని ఘోర దురవస్థ రావడానికి కారకులెవరు?ప్రపంచానికే వాక్సిన్ అందించే ఔషద రాజధానిగా దేశాన్ని మార్చామని గొప్పు…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా, మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. రోజువారి కరోనా మరణాల సంఖ్య నాలుగు వేలకు పైగా నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. పంజాబ్ లో ఈ పరిస్థితి దారుణంగా ఉన్నది. పంజాబ్ లో 44 రోజుల్లో 40 శాతం మరణాలు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. పంజాబ్ లో మార్చి 41 నాటికీ 6868 కరోనా మరణాలు ఉంటె, మే 14…