వంట నూనెల ధరలు సలసలా కాగిపోతున్నాయి. కొన్ని నెలలుగా నూనె ధరలు నిలకడగా ఉన్నప్పటికీ.. గత నెల నుంచి వంట నూనె ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ద్రవ్యోల్బణంతో వంట నూనె ధరలు పెరుగుతున్నాయి. భారతీయులు వినియోగించే వంట నూనెలో 60 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతుంది. దీంతో మూడేళ్ల క్రితం రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి.
ఇండియాలో మే నెలలో వంటనూనెల ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. వంటనూనెల ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా గరిష్టంగా పెరిగాయి. అమెరికా, ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి వంటనూనెలను దిగుమతి చేసుకుంటుంది. ఈద్ కారణంగా ఇండోనేషియాలో వంటనూనెల ఉత్పత్తిని నిలిపివేశారు. దీంతో ఇండియాకు దిగుమతి తగ్గుమతి తగ్గిపోయింది. అటు అమెరికాలో గతంలో బయోఫ్యూయల్‌లో 13శాతం రిఫైన్డ్ ఆయిల్ ను కలిపేవారని, కానీ, ఇప్పుడు 46 శాతం రిఫైన్డ్ ఆయిల్‌ను కలపుతున్నారని, దీంతో ఇండియాలో ధరలు…