కర్ణాటకలో రాజకీయ దుమారం ఊపందుకుంది. ముఖ్యమంత్రిని మార్చే అవకాశం, మరో ముగ్గురు ఉపముఖ్యమంత్రుల డిమాండ్‌పై జరుగుతున్న చర్చల మధ్య.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకె శివకుమార్ శనివారం పార్టీ కార్యకర్తలు, నాయకులను ఈ అంశంపై బహిరంగ ప్రకటనలు జారీ చేయవద్దని కోరారు.