భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సర్కార్ ఆదేశించింది. ఈ క్రమంలో.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. ఆపరేషన్ రోప్‌లో భాగంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించనున్నారు పోలీసులు. ఫిల్మ్ నగర్ నుంచి టోలిచౌకి మెజెస్టిక్ గార్డెన్స్ వరకు రెండు క్యారేజ్‌వేలలో ఆపరేషన్…