Baltimore Bridge collapse: అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే నౌకాశ్రయాల్లో ఒకటైన బాల్టిమోర్ సమీపంలో కార్గో షిప్ ఫ్రాన్సిస్ స్కాట్‌కీ బ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో వంతెన కుప్పకూలింది. ఈ ఘటన జరిగే సమయంలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న కార్లు, అందులోని ప్రయాణికులు చల్లటి నీటిలో పడిపోయారు. వీరి కోసం రెస్క్యూ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 948 అడుగుల కంటైనర్ షిప్ సింగపూర్ ఫ్లాగ్ కలిగిన డాలీ ఒక్కసారిగా వంతెనను ఢీకొట్టడంతో ఈ భారీ ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున…