Flipkart: ఐఫోన్ ఆర్డర్‌లో తలెత్తిన వివాదంలో ప్రముఖ ఇ-కామర్స్ ఫ్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్(Flipkart)కి వినియోగదారుల ఫోరమ్ జరిమానా విధించింది. ఒక వ్యక్తి ఐఫోన్ ఆర్డర్‌ని క్యాన్సిల్ చేసినందుకు, బాధితుడు అనుభవించిన మానసిక క్షోభకు పరిహారంగా రూ.10,000 చెల్లించాలని ఫోరమ్ ఫ్లిప్‌కార్ట్‌ని ఆదేశించింది. ఈ క్యాన్సిల్ ఉద్దేశపూర్వకంగా అదనపు లాభాన్ని ఆర్జించడం కోసం చేశారని, ఇది సర్వీస్‌లో లోపమని, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ అన్యాయమైన వ్యాపార పద్దతులను పాటించిందని సెంట్రల్ ముంబైలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ పేర్కొంది.