ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా వీరి మధ్య చర్చలు కొనసాగాయి. కాగా.. తెలంగాణలోని జాతీయ రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అందులో భాగంగా.. 15 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ఆధునీకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.