దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించనున్నారా? అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? తాజా పరిణామాలపై ఆమ్ ఆద్మీ ప్రభుత్వ అనుమానాలు నిజమేనా? ఆప్ కీలక నేత వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 1 నుంచి జైల్లోనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు బెయిల్ లభించలేదు. ఇదే కేసులో గతంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా జైలుకు వెళ్లి…