యూపీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. చాలా రోజులుగా మౌనంగా,అజ్ఞాతంలో ఉండిపోయిన బీఎస్పీ అధినేత్రి మాయావతి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చారు. యూపీ కాంగ్రెస్ చీఫ్, సీఎం అభ్యర్థినిగా ప్రచారం చేసుకుంటున్న ప్రియాంక గాంధీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలకు దిగారు. కాంగ్రెస్ కేవలం బీజేపీయేతర ఓట్లను చీల్చడానికే తప్ప, ఆ పార్టీతో వచ్చే ప్రయోజనం ఏమీ లేదని విమర్శించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు మాయావతి. ఆ పార్టీ సీఎం…