ఇటీవల ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వరంగల్ ఇచ్చిన రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ ‘రైతు రచ్చబండ’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో జగిత్యాలలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిందా తిలిస్మాత్‌గా రైతు బంధు మారిందని ఎద్దేవా చేశారు. మంత్రి మల్లారెడ్డి 500 ఎకరాలకు రైతు బంధు ఇస్తున్నారని, రియల్ వ్యాపారులకు ప్లాట్లు చేసి అమ్మిన పట్టాదారు పాస్ బుక్ ఉందని…
ఇవాళ్టి నుండి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమం ప్రారంభం కానుంది. రైతు డిక్లరేషన్ పై పల్లె పల్లెకు కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే.. నేడు ఆచార్య జయశంకర్ స్వగ్రామం అక్కంపేటలో రచ్చబండలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అంతేకాకుండా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నెదునూరు గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొననున్నారు. కొమురవల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పొన్నాల లక్ష్మయ్య, హుజూర్‌నగర్‌లోని చింతలపాలెం మండలం బుగ్గ మాదారం…