టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు అయినా నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత కల్పించలేకపోయిందని మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ విమర్శించారు. మంథనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఏదో ఒకరోజు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజు వస్తుందన్నారు. వివిధ శాఖల్లో ఉద్యోగ ఖాళీల గురించి ప్రభుత్వానికే స్పష్టత లేదు. ఖాళీల విషయంలో చిత్తశుద్ధి లేని ప్రభుత్వం.. యువతి యువకులకు ఏలాంటి భరోసా…