లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ తొలి కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం గురువారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో జరగనుంది. 100 నుంచి 125 లోక్‌సభ స్థానాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు యూపీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని సీట్లు కొలిక్కి రావచ్చని అంటున్నారు.