DK Shivakumar: వరస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి, కర్ణాటక సంక్షోభం కొత్త తలనొప్పిగా మారింది. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య తీవ్ర పోరాటం కొనసాగుతోంది. చెరో రెండున్నరేళ్ల పాటు సీఎం అనే ఒప్పందం ప్రకారం, తనకు అవకాశం ఇవ్వాలని డీకే కోరుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం డీకే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2004లో యూపీఏ ఘన విజయం సాధించిన తర్వాత, సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారని…