2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి నాలుకను కోసేస్తానని తమిళనాడులోని కాంగ్రెస్ నాయకుడు మణికందన్ బెదిరించాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ న్యాయమూర్తి నాలుకను కోసేస్తానని బెదిరించగా.. ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది.