నేడు భారత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ 57వ వర్ధంతి. 1947 ఆగస్టు 15న భారత తొలి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1964 మే 27న మరణించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని శాంతివన్లో గురువారం ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం, నెహ్రూ చెప్పిన మాటలను ట్విట్టర్ వేదికగా స్మరించుకున్నారు. ‘విచ్చలవిడిగా చెడు విజృంభిస్తే.. అది మొత్తం వ్యవస్థనే…