Off The Record: కాంగ్రెస్ పార్టీ అంటేనే విచ్చలవిడి అంతర్గత ప్రజాస్వామ్యం. ఒక్క గాంధీల కుటుంబాన్ని తప్ప… మిగతా వాళ్ళలో ఎవరు ఎవర్ని అయినా, ఏమైనా అనవచ్చంటూ పార్టీ వర్గాలే మాట్లాడుకుంటూ ఉంటాయి. ఈ స్వేచ్ఛ ముసుగులో ఇప్పుడు కోవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయని ప్రకటించి కలకలం రేపారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. అలాంటి వాళ్ళవల్ల పార్టీకి తీరని నష్టం జరిగిపోతోందని, గాంధీభవన్‌లో తీసుకున్న నిర్ణయాలు క్షణాల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్‌కు చేరిపోతున్నాయన్నది ఆయన వాదన. ఆ పార్టీ…