రాహుల్ గాంధీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై తీసుకున్న చర్యల గురించి హైదరాబాద్ పర్యటనలో మాట్లాడాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.