IndiGo Plane Incident: గాలిలో విమానం, తీవ్రమైన గుండె జబ్బులో బాధపడుతున్న ఓ పసికందు, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. చావుబతుకుల సమస్య. కానీ అప్పుడే ఓ అద్భుతం జరిగింది. పసికందు ప్రయాణించే విమానంలోనే ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. వారే చిన్నారి ప్రాణాలను నిలబెట్టారు. ఇందులో ఒక డాక్టర్ ఐఏఎస్ ఆఫీసర్. చిన్నారి పరిస్థితిని తెలుసుకుని అత్యవసరంగా చికిత్స అందించారు.