పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న సరిహద్దు వివాదానికి మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకొచ్చారు. యుద్ధాలను పరిష్కరించడంలో, శాంతిని స్థాపించడంలో తాను నిపుణుడినని పేర్కొన్నారు. ట్రంప్ మాట్లాడుతూ.. ఇది నేను పరిష్కరించబోయే 8వ యుద్ధం అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం గురించి చర్చ జరుగుతోంది.” శాంతిని మధ్యవర్తిత్వం చేయగల తన సామర్థ్యాన్ని నొక్కి చెబుతూ, “నేను యుద్ధాలను పరిష్కరించడంలో నిపుణుడిని, శాంతిని నెలకొల్పడంలో నేను నిపుణుడిని. అలా చేయడం గౌరవంగా భావిస్తున్నాను”…
భారత్, పాక్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఈ సమాచారాన్ని ఇచ్చారు. ఈ అంశంపై పాక్ మంత్రి స్పందించారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తక్షణ కాల్పుల విరమణను ధృవీకరించారు. భారతదేశం -పాకిస్థాన్ మధ్య కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలనే నిర్ణయంపై ఇరు దేశాలు అంగీకరించాయి. “పాకిస్థాన్-భారత్ తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయి. పాకిస్థాన్ తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను రాజీ పడలేదు. దేశంలో శాంతి, భద్రత కోసం…
పహల్గామ్ ఉగ్రదాడి.. ఆ తర్వాత దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాత్రి కాగానే డ్రోన్లు, క్షిపణులతో భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాలే లక్ష్యంగా పాకిస్థాన్ జరుపుతున్న దాడులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. మరోవైపు.. సరిహద్దుల్లో కాల్పులకు కూడా గట్టిగా బదులిస్తోంది. అదే సమయంలో పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత దళాలు భీకరదాడులకు దిగాయి. రెండు దేశాల…