రైతుల దుస్థితిపై బీజేపీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్ణయం మేరకు రైతులను కలుస్తున్నామన్నారు. మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మకై రైతుల పొట్ట కొట్టే పని చేస్తుందని మండిపడ్డారు. నెల రోజులుగా కుప్పలు పోసిన ధాన్యాన్ని కొనే వారు లేరని.. కలెక్టర్, అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు.