కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. కుటుంబ సభ్యుడు మరణించడంతో దశదిన కర్మలో భాగంగా అంగడి దింపుడు కార్యక్రమానికి ఎల్లారెడ్డి పట్టణం సంతకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా హాసన్ పల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడంతో పాటు మరో 14మంది గాయపడ్డారు.…
దళిత బహుజన ప్రజాజీవితాల్లో గుణాత్మక అభివృద్ధికోసం తన జీవితాంతం కృషిచేసిన ఐఏఎస్ మాజీ అధికారి బి.దానం మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు శాఖలకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాకుండా డాక్టర్ అంబేడ్కర్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షుడుగా పనిచేశారు దానం. దళిత బహుజన మైనారిటీ వర్గాలకు దానం విశేష సేవలందించారని సీఎం స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.