ప్రతిభకు ఆకాశమే హద్దు.. కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం అని సూచించారు మంత్రి కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రతిభకు ఆకాశమే హద్దు.. వచ్చే మూడు నాలుగు నెలలు మొబైల్ వాడకాన్ని తగ్గించండి.. 3 నెలలు ప్రణాళిక బద్ధంగా కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు…