IT Companies Lay offs: ఆర్థిక సంక్షోభ భయాలతో ఉద్యోగులను ఇంటికి పరిమితం చేస్తున్న కార్పొరేట్ కంపెనీల జాబితాలోకి ఇప్పుడు సిస్కో కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. నెట్ వర్కింగ్ రంగంలో పెద్ద సంస్థగా పేరొందిన సిస్కో.. 4 వేలకు పైగా కొలువులకు లేదా మొత్తం వర్క్ ఫోర్సులో 5 శాతానికి కోత పెట్టనుందని అంటున్నారు. అయితే.. ఆ కంపెనీ యాజమాన్యం మాత్రం ఈ వార్తల్ని ధ్రువీకరించట్లేదు. అలాగని.. పూర్తిగా తోసిపుచ్చటం కూడా చేయలేదు.