పార్టీ, ఫంక్షన్ ఇలా వేడుక ఏదైనా కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు. ఇలా ఇష్టమైన డ్రింక్స్ తాగుతుంటే.. ఆ మజానే వేరుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ వీటిని ఎంతో ఇష్టంగా తాగుతారు. అయితే.. అలాగే అలవాటైతే మీ శరీరంలో ఉన్న కాలేయం దెబ్బ తినే అవకాశం ఉంది. అవును, మీరు విన్నది నిజమే.. మీ కాలేయానికి చాలా హాని కలిగించే, కాలక్రమేణా కాలేయ వ్యాధులను కలిగించే కొన్ని పానీయాలు ఉన్నాయి.