Odisha Train Tragedy: ఒడిశాలో బాలాసోర్ సమీపంలో బహనాగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగి ఘోర రైలు ప్రమాదాన్ని దేశ ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు గూడ్స్ ను ఢీకొట్టడం, పక్క ట్రాక్ లో వస్తున్న మరో రైలు కోరమాండల్ రైలు బోగీలను మళ్లీ ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం జరిగింది.