ఆగ్నేయ బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో బలపడిన అల్పపీడనం కారణంగా ఉత్తారంధ్రలో భారీనుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ కమిషనర్ కె. కన్నబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని, ఆ తర్వాత 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర…