5 Politicians Dies In Plane Crash In Colombia: సెంట్రల్ కొలంబియాలో చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఐదుగురు రాజకీయ నాయకులు మృతి చెందారు. వీరు బుధవారం మరణించినట్లు కొలంబియా అధికారులు తెలిపారు. మరణించిన రాజకీయ నాయకులు.. కొలంబియా మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబ్‌కు చెందిన సెంట్రో డెమొక్రాటికో పార్టీలో సభ్యులుగా ఉన్నారు. పార్టీ సమావేశంలో పాల్గొనడానికి విల్లావిసెన్సియో నుంచి బొగొటాకు విమానంలో ప్రయాణింస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మాజీ సెనేటర్…