జిల్లాల పునర్విభజన తర్వాత భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా ఏర్పాటైంది. పాలనకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో లేకపోవడంతో భీమవరం సమీపంలోని ప్రైవేటు కార్యాలయంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు.. ప్రస్తుతం ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న కలెక్టరేట్ కోసం 20 ఎకరాల భూమి, 100 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.