ఆదిలాబాద్ జిల్లా గూడెం వాసులు గుక్కెడు నీటికోసం తిప్పలు పడుతున్నారు..రోడ్డు సౌకర్యం లేక అల్లాడిపోతున్నారు..ఏళ్లు గడిచినా ఎవ్వరు పట్టించుకోకపోవడంతో గోస పడుతున్నారు ..చివరికి జిల్లా కలెక్టరేట్ కు మొరపెట్టుకోవడం కోసం గూడెం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు..అయినా స్పందించకపోవడం మూడు రోజులుగా కలెక్టరేట్ ముందు దీక్షకు దిగారు.. ఇదిగో ఇది ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కుండిషేక్ గూడెం ఇది.. గూడెం వాసులకు తాగునీటికోసం తంటాలుపడాల్సిన పరిస్థితి..ఊర్లో బోరు లేదు..పొలాల్లో ఉండే అల్లంతదూరంలోని బావి…
కరోనా, ఒమిక్రాన్ థర్డ్‌వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను అంతరంగికంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 12వ తేదీన స్వామివారి తెప్పోత్సవం, 13న నిర్వహించే ఉత్తరద్వార దర్శనాలకు భక్తులను అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. Read Also: మంత్రి కొడాలి…
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల మరియు కాలేజ్ పిల్లలకు ఆట స్థలం క్రింద ఉన్న ఒకే ఒక్క స్థలంలో ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేపట్టాలని అక్కడి అధికారులు భావిస్తున్నారు. దాంతో ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు పాఠశాలల విద్యార్థులు. మాకు ఆడుకోవడానికి గ్రౌండ్ కావాలి… చుట్టుపక్కల రెండు మూడు ఊర్లలో ఒక్క గ్రౌండ్ కూడా లేదు. మాకు ఈ ఒక్క గ్రౌండ్ మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ కోల్డ్…
బుల్లెట్ బండి పాట.. ఈ పది పదిహేను రోజుల నుంచి ఓ ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాట… ఈ పాట మొదట్లో ఎవరు అంతగా పట్టించుకోకున్న.. ఓ పెళ్లికూతురు డాన్స్ చేయడంతో ప్రచుర్యంలోకి మరింత వచ్చింది. ఈ డాన్స్ తర్వాత రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో ఓ నర్స్ నృత్యం చేయడం అందరిని ఆకట్టుకుంది. కానీ ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో చేయడం వివాదానికి దారి తీయడం.. వెంటనే జిల్లా వైద్యాధికారి సుమన్…
ఇటీవలే ఓ నూతన వధువు బుల్లెట్ బండి పాటకు డాన్స్ చేసి ఇరగదీసిన సంగతి తెలిసిందే. ఆమె డాన్స్ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకోవడంతో ఎక్కువగా షేర్ అయింది. అయితే తాజాగా ఈ పాటకు ఓ నర్సు చేసిన డాన్స్ వీడియో వైరల్ అయింది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పీహెచ్‌కి చెందిన నర్సు ఆస్పత్రి ప్రాంగణంలో ఈ డాన్స్ చేసింది. కాగా, ఆ నర్సు ఆస్పత్రిలో చేయడంతో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కలెక్టరు కూడా సీరియస్…
వీఆర్‌ఎస్ తీసుకున్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.. బీఎస్పీలో చేరారు.. ఈ సందర్భంగా నల్గొండ వేదికగా భారీ బహిరంగసభ నిర్వహించారు.. పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి బలప్రదర్శన చేశారు.. జనసమీకరణకు విద్యార్థుల నుంచి వివిధ వర్గాల వరకు ఆయనకు మద్దతు లభించింది.. బహిరంగసభకు హాజరైన జనాన్ని చూస్తే.. వాళ్లు పెట్టిన ఎఫెక్ట్ కనిపిస్తుంది.. అయితే, ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి తహసీల్దార్ రాధపై బదిలీ వేటు పడడం చర్చగా మారింది.. పీఏ పల్లి…
రాజమండ్రిలో జిల్లా కోవిడ్ ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ… జిల్లాలో ప్రతీరోజు దాదాపు వెయ్యి కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 5 వేల మందికు పరీక్షలు నిర్వహిస్తుంటే 20 శాతం మందికి కరోనా నిర్ధారణ అవుతోంది. కోవిడ్ నిబంధనలు ప్రజలు బాధ్యతాయుతంగా పాటించాలి. రాత్రి కర్ఫ్యూ సమయం సహా అవసరమైతే తప్ప పగలు కూడా ప్రజలు బయట తిరగడం తగ్గించుకోవాలి. తల్లిదండ్రులు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సపొందుతుంటే వారి పిల్లలు ఇంటి దగ్గర అవస్థలు…