వికారాబాద్ లోని మూసీనదితో పాటు కాగ్నానది, కోట్ పల్లి ప్రాజెక్ట్, సర్పన్ పల్లి, నంది వాగు ప్రాజెక్టుల నీరు అలుగు పారి ప్రవహిస్తుంది. దీంతో అప్రమత్తమైన ఐజీ షనవాజ్ ఖాసీం, జిల్లా ఎస్పీ కోటిరెడ్డితో కలిసి కోట్ పల్లి ప్రాజెక్ట్ ను సందర్శించారు. ధారూర్ సమీపంలోని నాగ సముందర్ వద్ద రాక పోకలు నిలిచిపోవడంతో అక్కడి పరిస్థితులను ఆయన పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.