ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడింది.. దీంతో, కొత్తగా ఏర్పడ్డ జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ అఫ్ కాండక్ట్ అమలులోకి వచ్చిందని తెలిపారు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు.. ఆత్మకూరు ఉప ఎన్నికపై మీడియాతో మాట్లాడిన ఆయన.. కోడ్ అమలు పర్యవేక్షణకు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ గడపగడపకు సహా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన కూడదని స్పష్టం చేశారు. Read…